![]() |
![]() |

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ షోకి బిగ్ బాస్ అండ్ బుల్లితెర సెలబ్రిటీస్ ఎంట్రీ ఇచ్చారు...యాదమ్మ రాజు - స్టెల్లా, అర్జున్ కళ్యాణ్- శ్రీ సత్య, శ్రీకర్- హమీద..ఇక వీళ్ళు రాగానే సుమ దోచెయ్ రౌండ్ లో భాగంగా ఒక ప్రశ్న వేసింది. "ఆరోగ్యం అనగానే గుర్తొచ్చేదేమిటి" అని అడిగేసరికి "ఆడవాళ్ళకు దూరంగా ఉండడం" అంటూ ఠకీమని ఆన్సర్ ఇచ్చాడు యాదమ్మ రాజు. "ఈ మాట నువ్వు ఎందుకు చెప్పావ్" అని సుమ అడిగేసరికి "ఎందుకంటే పెళ్లయ్యింది కాబట్టి .. ఆరోగ్యం చెడిపోవడానికి కారణంగా లవ్, మ్యారేజ్ " అని రివర్స్ లో చెప్పాడు.
తర్వాత శ్రీకర్ హమీదాతో చాల ఎమోషనల్ డైలాగ్స్ చెప్పాడు.."ఇన్నాళ్లు నాతో ఉండి ఇప్పుడు వదిలి వెళ్లిపోవడం ఏమిటి" అనేసరికి "ఇన్నాళ్లు నువ్వేమీ చేయలేదు.." అందుకే అని హమీద అనేసరికి శ్రీకర్ సిగ్గుపడిపోయి తలపట్టుకున్నాడు. తర్వాత జెంట్స్ అంతా లేడీ గెటప్స్ లో వచ్చి మంచి కామెడీ స్కిట్ చేశారు. ఇక చివరిలో శ్రీకర్ రెడ్ హార్ట్ బెలూన్ తీసుకుని హమీదాకు "ఐ లవ్ యు" అంటూ ప్రొపోజ్ చేసాడు..ఇక హమీద ఏమీ తక్కువ తినలేదు..వెంటనే శ్రీకర్ కాలి మీద కూర్చుకుని ముద్దు పెట్టేసింది. ఇక నెటిజన్స్ ఈ కొత్త కెమిస్ట్రీ చూసి షాకయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హమీదని మోసం చేసే రోల్ లో శ్రీకర్ నటించాడు. ఇక ఇందులో సుమ ఎవరెవరికి ఎలాంటి మొగుడు కావాలి అని అడిగేసరికి తనకు కొరియన్ మొగుడు కావాలని శ్రీసత్య చెప్పేసరికి, తనకు ఆఫ్రికన్స్ భార్యగా కావాలని యాదమ్మరాజు కామెంట్ చేసాడు. దాంతో అందరూ నవ్వేశారు.
![]() |
![]() |